#700

దేవుడు లోకమును నెంతో ప్రేమించెను పల్లవి: దానమిచ్చెను ధరణికి దేవుడు ప్రేమతో తన ప్రియ తనయున్ లోకమునెంతో ప్రేమించెన్ - కుమారునియందు విశ్వసించువారిని రక్షింపగనెంచి ||దానమిచ్చెను||

రచయిత: రెవ. కొంగర సామ్యేల్ సంజీవి

Category: రెండవ అనుబంధము · Open in the hymnal app

పల్లవి · Pallavi
దేవుడు లోకమును నెంతో ప్రేమించెనుదానమిచ్చెను ధరణికి దేవుడు ప్రేమతో తన ప్రియ తనయున్ లోకమునెంతోప్రేమించెన్ – కుమారునియందు విశ్వసించు వారిని రక్షింపగ నెంచి ||దానమిచ్చెను||
చరణము 1
దూతలు అర్ధరాత్రియందున – ఖ్యాతిగా శుభవార్త దెలిపిరి బెత్లహేము పట్టణమందునప్రభుయేసు పుట్టెను రక్షకుడాయన – రయమున జూడుడి ||దానమిచ్చెను||
చరణము 2
ప్రాణమియ్యను పాపుల కొరకై – ప్రేమతో ప్రభుయేసు వచ్చెను దేవుని మహిమను విడిచి – మానవుడయ్యెను మనవంటివాడుగా – మహిలోన పుట్టెను ||దాన||
చరణము 3
చేర్చుకొనుడి మీ హృదయములలో – ప్రీతితో ప్రభు యేసు రక్షకుని పాపికి పరిహారము మరియు – పరిశుద్ధ జీవితం పరలోక ఆనందం – ప్రభుయేసుడిచ్చును ||దానమిచ్చెను||
చరణము 4
హల్లెలూయా పాడుదాము – దేవుని అమూల్య ప్రేమకై యేసు మనకిచ్చినందుకై మన రక్షణ కొరకై హొసన్న పాడుదాం ||దాన||