#699

రాగము - ద్విజావంతి జయజయవంతి మిశ్రము తాళమ

రచయిత: సాల్మన్ రాజు

Category: రెండవ అనుబంధము · Open in the hymnal app

పల్లవి · Pallavi
రాగము - ద్విజావంతి జయ జయ వంతి మిశ్రము తాళము - ఆదియేసు నామమే పావనము – ప్రభుయేసే రక్షణ కారణము – మనుజాళి పాపము తీరగా – మరణాబ్ది తీరము చేరగా – శ్రీయేసు మాకు దారిగదా
చరణము 1
స్వామి యేసు మాలో – తన ప్రేమ నిలుపగా – యెనలేని దీవిగా – తనమేను బలినివ్వలేదా ||యేసు||
చరణము 2
పాప ఘోర తాప – తతి బాపి కరుణతో – చెయ్యిజాపి ప్రేమచే – తన ప్రాపుమనకిడలేదా ||యేసు||
చరణము 3
రక్త సిక్త బాట – మనముక్తి పదముగా – అనురక్తి చూపుగా – మనపాలి రక్షకుడాయెగదా ||యేసు||
చరణము 4
చావు గెలిచి మాకు – తన జీవమొసగగా – మముకాయువాడుగా – ఘనదేవుడితడగు గాదా ||యేసు||
చరణము 5
దారి కానరాని – కడు ఘోర వనములో – నడియాదువేళలో మముచేరబిలిచిన వాడుగదా ||యేసు||
చరణము 6
ఎన్నరాని రేడు – మముకన్న సుతులుగా – చేకొన్నవాడుగా తనపేరుమనకిడిలేదా ||యేసు||
చరణము 7
నేడు యేసు రాజు – మన తోడు నడువగా – కొనియాడి వేడుచు – కవిసీమ నిలుతుము వేగ ||యేసు||