#698
మధుర మధుర మధురసేవ – యేసు ప్రభు సేవ
పల్లవి · Pallavi
రా.. తిలకమోదతా–ఆదిమధుర మధుర మధుర సేవ – యేసు ప్రభు సేవ
చరణము 1
దేవదూతకును లేని దైవజనుని సేవ – దేవసుతుని సంఘ సేవ దివ్యమౌసువార్త సేవ ||మధుర||
చరణము 2
పరిశుద్ధాత్మ ప్రోక్షణముచే ప్రజలు వర్ధిల్లు సేవ – పరిమళించు వాక్య సేవ ప్రతిఫలించుసాక్ష్య సేవ ||మధుర||
చరణము 3
प्रभुని పేర ప్రజల యెదుట ప్రవచనాల సేవ – ప్రజల పేర ప్రభుని యెదుటప్రార్థనలు అర్చించు సేవ ||మధుర||
చరణము 4
భాగ్యభోగ నిధులు లేని భారభరిత సేవ – బాష్పసిరులలోన మెలగిబాధలను వరించు సేవ ||మధుర||
చరణము 5
సిలువమూర్తి కృపలు చాట సిగ్గుపడని సేవ – సిలువ నిందలను భరింపశిరము వంచి మురియు సేవ ||మధుర||
చరణము 6
లోకజ్ఞాని అపహసించు శోకమూర్తి సేవ – లోకులను దీవించు సేవలోకమును జయించు సేవ ||మధుర||
చరణము 7
దైవజనుడా మరవకోయి దైవపిలుపునోయి – దైవనీతి వదలకోయి దేవుడుదీవించునోయి ||మధుర||