#697
అందాల తార అరుదెంచె నాకై అంబర వీధిలో అవతా
చరణము 1
అందాల తార అరుదెంచె నాకై అంబర వీధిలోఅవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ఆనందసంద్రముప్పొంగె నాలో అమరకాంతిలోఆది దేవుని చూడ ఆశింప మనసు పయనమైతిని ||అందాల||
చరణము 2
విశ్వాసయాత్ర దూరమెంతైనా – విందుగా దోచెను వింతైనాశాంతి వర్షించె నాలో – విజయపథమునవిశ్వాసలేని దేవుని కుమారుని – వీక్షించు దీక్షతో విరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ విశ్రాంతి నొసగుచున్ ||అందాల||
చరణము 3
యెరూషలేము రాజనగరిలో యేసుని వెదకుచు ఎరిగిన దారితప్పిన వేళ యెదలో కృంగితియేసయ్యతార యెప్పటివోలె యెదురాయె త్రోవలోఎంతో యబ్బురపడుచు విస్మయమొందుచు యేగితి స్వామి కడకు ||అందాల||
చరణము 4
ప్రభు జన్మస్థలము పాకయేగాని – పరలోక సౌధమేబాలుని చూడ జీవితమంత పావనమాయెనుప్రభుపాదపూజ దీవెనకాగ ప్రసరించె పుణ్యముబ్రతుకే మందిరమాయె అర్పణలే సిరులాయె ఫలించె ప్రార్థన ||అందాల||