#696
సిలువ మోసినావా - శ్రమలకోర్చినావా - యేసున
పల్లవి · Pallavi
సిలువ మోసినావా – శ్రమలకోర్చినావా – యేసునాథసత్య జీవం స్వర్గమునకు దారి
అనుపల్లవి · Anupallavi
అహా – నా దోషములే – మహావేదన పెట్టెనా – మోక్షరాజా – సర్వసత్య సంపూర్ణ ప్రదీప
చరణము 1
రాత్రియంతటను – రోదనముచే – గెత్సేమనే వనమందు – గడిపి గొప్పవేదనముతో – ప్రార్థింపగ తండ్రిని – ప్రాణనాథరక్తధారలు – నాకై రాల్చినావా ||సిలువ||
చరణము 2
కత్తులు గుదియలతో వచ్చినారా – కట్టికొట్టుచు నిన్ తిట్టినారాకండ్లగంతలు కట్టి – కొరడాలతోను గొట్టి కఠినులంతాముండ్లముకుటమౌ దల ముత్తినారా ||సిలువ||
చరణము 3
కొయ్యనెత్తి – కల్వరిగిరి వరకు మోయుమనుచు నిన్ – మరి ముత్తినారా మూర్ఖులందరు నీదు – మోముపై నుమియుచున్ –మోక్షనాథ యెరూషలేం – పురవీధుల త్రిప్పినారా ||సిలువ||
చరణము 4
జీవజలములు – జీవమునిచ్చే దేవ – దాహమాయెనా – ధరణియందునీకు – చేదు కలిపినట్టి – ద్రాక్షారసమునిచ్చి – ద్రాగనునిరాదాహము తీరెనా – నీకు తండ్రి ||సిలువ||
చరణము 5
పంచఖండంబు – ప్రజలన్ రక్షింప – పంచగాయంబులను పొందితుదకు – అప్పగింతున్ తండ్రి – ఆత్మనిదిగో యనుచు – జెప్పినాథా ఆత్మకై అర్పణ నిచ్చినావా ||సిలువ||
చరణము 6
మరణమై నీవు మరి లేచినావా – మరణపు ముండ్లను – మరి విరిచినావామాకు విజయమిచ్చి – మోక్షపురికి మరల నరిగినావాహల్లెలూయా మళ్ళీ వచ్చెదవా? ||సిలువ||