#694
స్తోత్రం చెల్లింతుము - స్తుతిస్తోత్రము చ
పల్లవి · Pallavi
స్తోత్రం చెల్లింతుము – స్తుతిస్తోత్రము చెల్లింతుముయేసునాథుని మేలులు – తలంచి (2) ||స్తోత్రం||
చరణము 1
దివారాత్రములు కంటిపాపవలె కాచి (2)దయగల హస్తముతో – బ్రోచి నడిపించితివి (2) ||స్తోత్రం||
చరణము 2
గాఢాంధకారములో కన్నీటి లోయలలో కృశించిపోనీయక – కృపతో బలపరచితివి ||స్తోత్రం||
చరణము 3
సజీవయాగముగా – మన శరీరము సమర్పించిసంపూర్ణ శుద్ధినొంద – శుద్ధాత్మను నొసగితివి ||స్తోత్రం||
చరణము 4
సీయోను మార్గములో పలుశోధనలు రాగా సాతాన్నిజయించుటకు – విశ్వాసము నిచ్చితివి ||స్తోత్రం||
చరణము 5
సిలువను మోసుకొని సువార్తను చెప్పి యేసుని వెంబడింప – ఎంత భాగ్యము నిచ్చితివి ||స్తోత్రం||
చరణము 6
పాడెద హల్లెలూయా – మరనాత హల్లెలూయా సదా పాడెద హల్లెలూయా – ప్రభు యేసుకు హల్లెలూయా ||స్తోత్రం||