#693

స్వచ్ఛంద సీయోనువాసి - సర్వాధికారి కస్తూర

రాగం: చేయువాడు

Category: రెండవ అనుబంధము · Open in the hymnal app

పల్లవి · Pallavi
స్వచ్ఛంద సీయోనువాసి – సర్వాధికారి కస్తూరిపూ రాసి
అనుపల్లవి · Anupallavi
వర్తమాన భూత భవిష్యత్కాలవాసి – ఆల్ఫా ఓమెగాతానే – ఆద్యంతము మన యేసే ||స్వచ్ఛంద||
చరణము 1
ఇదిగో నేనొక నిబంధనను – అద్భుతముగా జేతున్ నీ ప్రజలందరి యెదుట – పరిశోధింపజాలని మహా – పనులల్లాప్రభు – వే – లెక్క లేని అద్భుతములు – మక్కువతో
చరణము 2
సంగీతనాదములతోడ – సీయోనుపురము –సొంపుగాను చేరితిమి శాశ్వత సంతోషము – మా శిరములపై వెలిసెన్ –దుఃఖము నిట్టూర్పును పోయెన్ – మిక్కిలి ఆనందము కలిగెన్ ||స్వచ్ఛంద||
చరణము 3
నీలముల పునాదులు వేసి – నీలాంజనములతోమాణిక్యమణులతో – సువర్ణ సునీయములతో సూర్యకాంతులతో – ప్రశస్త రత్నములతోప్రవిమలముగా – నినుకట్టెదను ||స్వచ్ఛంద||
చరణము 4
సుమముల హరము – సంతోషానంద తైలమునీవే స్తుతి వస్త్రమును నీ – వే – ఉల్లాస వస్త్రంబునీవే విడుదలయు నీ వే – హితవత్సరము విముక్తిఆత్మాభిషేకము నీవే ||స్వచ్ఛంద||
చరణము 5
జలములలో పడి దాటునప్పుడు బలమై యుండెదను నీతోడై యుండెదను – నదులలో పడి వెళ్ళునప్పుడు నీపై పారవు– అగ్ని మధ్యను నడిచినను జ్వాలలు నిన్నుకాల్చలేవు ||స్వచ్ఛంద||
చరణము 6
ఇత్తడి తలుపులు – పగులగొట్టెద – ఇనుపగడియలను విడగొట్టెద నేను – అంధకారస్థలములలో నున్నట్టి నిధులురహస్యములోమరుగైన – ధనమును నీ కొసంగెదను ||స్వచ్ఛంద||
చరణము 7
గర్భమున పుట్టింది మొదలు – తల్లిఒడిలోన కూర్చుండింది మొదలు – నేను చంక పెట్టుకొన్న నాదు ప్రజలారా – ముదిమి వచ్చువరకు నిన్ను – ఎత్తుకొనువాడను నేనే ||స్వచ్ఛంద||