#692

సీయోను పాటలు సంతోషముగను పాడుచు సీయోను వె

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Category: రెండవ అనుబంధము · Open in the hymnal app

పల్లవి · Pallavi
సీయోను పాటలు సంతోషముగాను పాడుచు సీయోను వెళ్ళుదము
చరణము 1
లోకాన శాశ్వతానందమేమియు – లేదనిచెప్పెను ప్రియుడేసు పొందవలె నీ లోకమునందు – కొంతకాల మైనాశ్రమలు ||సీయోను||
చరణము 2
ఐగుప్తును విడిచినట్టి మీరు – అరణ్యవాసులైఈ ధరలో నిత్యనివాసము లేదీ లలోన – నేత్రాలు కానానుపై నిలుపండి ||సీయోను||
చరణము 3
మారానుపోలిన చేదైన స్థలము – ద్వారా పోవలసియున్ననేమి – నీ రక్షకుండగు యేసే నడిపును – మారని తనదుమాట నమ్ము ||సీయోను||
చరణము 4
ఐగుప్తు ఆశలు అన్నియు విడిచి – రంగుగ యేసునివెంబడించి పాడైన కోరహు పాపంబుమాని – విధేయులైవిరాజిల్లండి ||సీయోను||
చరణము 5
ఆనందమయ పరలోకంబు మనది – అక్కడనుండివచ్చునేసు సీయోను గీతము సొంపుగ కలిసి – పాడెదముప్రభుయేసుకు జై ||సీయోను||