#691
సాగిలపడి మ్రొక్కెదము - సత్యముతో - ఆత్మతో
పల్లవి · Pallavi
సాగిలపడి మ్రొక్కెదము – సత్యముతో – ఆత్మతోమన ప్రభు యేసుని – ఆ ఆ ఆ ||సాగిల||
చరణము 1
మోషేకంటే శ్రేష్ఠుడు – అన్ని – మోసములనుండి – విడిపించున్వేషధారులను ద్వేషించున్ – ఆశతో – మ్రొక్కెదము ||సాగిల||
చరణము 2
అహరోనుకంటే శ్రేష్ఠుడు – మన ఆరాధనకుపాత్రుడు ఆయనే ప్రధాన యాజకుడు – అందరము – మ్రొక్కెదము ||సాగిల||
చరణము 3
ఆలయముకన్న – శ్రేష్ఠుడు – నిజ – ఆలయముగా తానే యుండెన్ ఆలయము మీరు యనెను – ఎల్లకాలము మ్రొక్కెదము ||సాగిల||
చరణము 4
యోనాకంటే శ్రేష్ఠుడు – ప్రాణ –దానముగా తను అర్పించెన్ – మానవులను విమోచించెన్ – ఘన పరచి మ్రొక్కెదము ||సాగిల||
చరణము 5
సొలొమోనుకన్న శ్రేష్ఠుడు –సర్వజ్ఞానమునకు ఆధారూడు పదివేలలోఅతిప్రియుడు – పదిలముగా మ్రొక్కెదము ||సాగిల||
చరణము 6
రాజులకంటే శ్రేష్ఠుడు యాజకులుగామనలను చేసెన్ రాజరాజుగత్వరలో వచ్చున్ – రయముగాను మ్రొక్కెదము ||సాగిల||
చరణము 7
అందరిలో అతి శ్రేష్ఠుడు – మనకందరికి తానేప్రభువు హల్లెలూయకు పాత్రుడు – అనుదినము మ్రొక్కెదము ||సాగిల||