#689

హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Category: రెండవ అనుబంధము · Open in the hymnal app

పల్లవి · Pallavi
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయాహల్లెలూయయని పాడెదను ఆనందముతో నేను సాగెదను
చరణము 1
సర్వకృపానిధియగు ప్రభువా – సకలచరాచర సంతోషమాస్తోత్రము చేసి స్తుతించెదవు – సంతోషముగా నిన్నుపొగడెదము ||సర్వ||
చరణము 2
ప్రేమించి నన్ను వెదకితివి – ప్రీతితో నన్నురక్షించితివి పరిశుద్ధముగా జీవించుటకై – పాపిని నన్ను కరుణించితివి ||సర్వ||
చరణము 3
అల్పకాల శ్రమలనుభవింప – అనుదినము కృపనిచ్చితివినాథుని అడుగుజాడలలో – నడుచుటకు నన్ను పిలిచితివి ||సర్వ||
చరణము 4
మరణ శరీరము మార్పునొంది –మహిమ శరీరము పొందుటకై – మహిమాత్మతో నన్ను నింపితివి – మరణ భయములను తీర్చితివి ||సర్వ||