#688

వెండి బంగారములకన్న - యేసుని కలిగియుండెదమ

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Category: రెండవ అనుబంధము · Open in the hymnal app

పల్లవి · Pallavi
వెండి బంగారములకన్న – యేసుని కలిగియుండెదమువెలగల భూషణములకన్న – యేసుని కలిగియుండెదము
చరణము 1
అడవిరాజు తన పిల్లలను – లేమి కలిగి ఆకలిగొనునుదేవుని ఆశ్రిత జనులకు ఎప్పుడు – మేలులు కొదువై యుండవుగా ||వెండి||
చరణము 2
మన ప్రభువుండు మహాదేవుడు – ఘనమహోన్నత్యము గల రాజురక్షణ కర్త ప్రధానకాపరి – ఆయన మేపెడి గొర్రెలము ||వెండి||
చరణము 3
వారి గుర్రములు రథములను బట్టి జనులుగర్వింతురు మనమైతే మన దేవుని నీతి – న్యాయములను శ్లాఘింతుము ||వెండి||