#687

లేచినాడూరా - సమాధి గెలిచినాడూరా - యేసు ల

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Category: రెండవ అనుబంధము · Open in the hymnal app

పల్లవి · Pallavi
లేచినాడూరా – సమాధి గెలిచినాడూరా – యేసులేచినాడూరా – సమాధి గెలిచినాడూరా
అనుపల్లవి · Anupallavi
లేతునని తా చెప్పినట్లు – లేఖనములలో పలికినట్లు ||లేచినా||
చరణము 1
భద్రముగా సమాధిపై – పెద్దరాయిని ఉంచి భటులుముద్రవేసి రాత్రియంత నిద్రలేక కావలియున్న ||లేచినా||
చరణము 2
ప్రభువు దూత పరమునుండి – త్వరగా దిగి రాయిని దొర్లించిభీకరదానిపై కూర్చుండె – భయము నొంద కావలివారు ||లేచినా||
చరణము 3
ప్రొద్దు పొడవక ముందే స్త్రీలు సిద్ధపరచినసుగంధములు శ్రద్ధతోడ తెచ్చి యేసుకు – రుద్దుదామని వచ్చి చూడ ||లేచినా||
చరణము 4
చూడవెళ్ళిన స్త్రీలను దూత – చూచి అప్పుడే వారితోడలేడు గలిలయ ముందరగా పోతున్నాడు – అప్పుడే లేచినాడని ||లేచినా||
చరణము 5
చచ్చిపోయి లేచినాడు – స్వామి భక్తులకు కనబడినవాడుచచ్చినను నన్ను లేపుతాడు – చావు అంటే భయపడరాదు ||లేచినా||
చరణము 6
నేను చేసే పనులనెరుగు – నేను నడిచేమార్గమెరుగు నేనుచెప్పే మాటలెరుగు – నేను బ్రతికే బ్రతుకునెరుగు ||లేచినా||
చరణము 7
నేను లేచిన యేసునందు – మానక మదినమ్మియుందు – తాను నాలో ఉన్నందున – దయను చేర్చును మోక్షమందు ||లేచినా||
చరణము 8
పాపభారము లేదు మనకు మరణభయములేదు మనకు నరకబాధ లేదు మనకు – మరువకండి యేసుప్రభుని ||లేచినా||
చరణము 9
యేసునందే రక్షణ భాగ్యం – యేసునందే నిత్యజీవంయేసునందే ఆత్మశాంతి – యేసునందే మోక్షభాగ్యం ||లేచినా||
చరణము 10
పాపులకై వచ్చినాడు – పాపులను కరుణించాడుపాపులను ప్రేమించినాడు – ప్రాణదానము చేసినాడు ||లేచినా||