#686
రేయింబగలు నీ పదసేవే - యేసు ప్రభువా - చేయ
పల్లవి · Pallavi
రేయింబగలు నీ పదసేవే – యేసు ప్రభువా – చేయుట మేలుసాటిలేని దేవుడవు నీవే – నాదు కోట కొండయు నీవే
చరణము 1
పరమపురిలో వరదా నిరతం – దూతగణములస్తుతులను సల్పి శుద్ధుడు పరిశుద్ధుడనుచు – పూజనొందే దేవుడవు నీవే ||రేయిం||
చరణము 2
జిగటమన్నే మానవులంతా – పరమ కుమ్మరి ప్రభుడవు నీవేసృష్టికర్తను మరచి జనులు – సృష్టిని పూజించుట తగునా ||రేయిం||
చరణము 3
పెంటకుప్పలనుండి దీనుల – పైకిలేపు ప్రభుడవు నీవేగర్వమణచి గద్దెలు దించి – ఘనులనైనా మేపవు గడ్డి ||రేయిం||
చరణము 4
నరుల నమ్ముట కంటే నిజముగా – నీదు శరణంశరణం దేవా రాజులను ధరణి నమ్ముటకంటే – రాజరాజవు నాకాశ్రయము ||రేయిం||
చరణము 5
అగ్నివాసన అంటకుండా – అబేద్నెగోలతో నుండినదేవా – దానియేలును సింహపు బోనులో – ఆదుకొన్న నాథుడవు నీవే ||రేయిం||
చరణము 6
పరమగురుడవు ప్రభులకు ప్రభుడవు – వరముచేర్చు పదము నీవేఅడుగుజాడల నడిచిన – హనోకు – పరము చేరె ప్రాణముతోడ ||రేయిం||
చరణము 7
మృతుల సహితము లేపినావు – మృతిని గెలిచిలేచినావు మృతులనెల్ల లేపువాడవు – మృత్యువును మృతిలేపినావు ||రేయిం||