#685
రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు
పల్లవి · Pallavi
రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడుప్రయాసపడి భారము మోయువారలుప్రభుని చెంతకు పరుగిడి వేగమే
చరణము 1
యేసుని పిలుపు వినియు నింక – యోచింపనేలఅవనిలో అజాగ్రత్తపాలైన అబద్ధ శాంతి ఆత్మకు ఇలలో ||రండి రండి||
చరణము 2
కరువు రణము మరణము చూచి కలుగదుమారుమనస్సు ప్రవచనములు సంపూర్ణములాయెను యూదులు తిరిగి చూచుచున్నారు ||రండి రండి||
చరణము 3
ప్రభు యేసు నీ కొరకై తనదు – ప్రాణము నిచ్చెగదాసిలువను రక్తము చిందించియును – బలియాయెను యా ఘనుడు మనకై ||రండి రండి||
చరణము 4
యేసుని నామమునందే పరమ – నివాసము దొరకునుముక్తిని పాప విమోచనమును – శక్తిమంతుడు యేసే ఇచ్చును ||రండి రండి||
చరణము 5
నేనే మార్గము, నేనే సత్యము – నేనే జీవమునునేను గాక ఇంకెవరు లేరని యెంచి చెప్పిన యేసుని వద్దకు ||రండి రండి||