#684

రమ్ము! నీ తరుణమిదే - పిలచుచున్నాడు నీ ప్

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Category: రెండవ అనుబంధము · Open in the hymnal app

పల్లవి · Pallavi
రమ్ము! నీ తరుణమిదే – పిలచుచున్నాడునీ ప్రభువైన – యేసు నొద్దకు
చరణము 1
జీవితమంతయు – వ్యర్థముగాను దుఃఖముతోను గడుపుటయేల – వచ్చి ఆయన శరణు జొచ్చినచోవాంఛతో నిన్ను – స్వీకరించును ||రమ్ము||
చరణము 2
కట్టిన ఇల్లు – ధనధాన్యములు కనబడు బంధుమిత్రులునుగూడు విడిచి – నీవు పోయినచో – వెంట నీతో రారెవరు ||రమ్ము||
చరణము 3
అందము మాయ – అస్థిరమే – దాని నమ్మకుము మోసగించునుమరణము ఒకనాడు వచ్చును మరవకుము – నీ ప్రభువును ||రమ్ము||
చరణము 4
మిన్ను క్రిందన్ – భూమి మీదన్ – మిత్రుడేసు నామము గాకరక్షణ పొందు – దారి లేదు రక్షకుడేసే – మార్గము ||రమ్ము||
చరణము 5
తీరని పాప వ్యాధులును – మారని నీదు – బలహీనతల్ ఘోర సిలువలో – మోసి తీర్చెను – గాయములచే బాగుపడెన్ ||రమ్ము||
చరణము 6
సత్యవాక్కును నమ్మి రమ్ము – నిత్యజీవమును నీకిచ్చును నీ పేరు జీవపుస్తకమునందు నిజముగా ఈనాడే – వ్రాయును ||రమ్ము||