#682
యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరి
పల్లవి · Pallavi
యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గంపరిపూర్ణమైనది నీ మార్గం ||యెహోవా నా||
చరణము 1
నా శత్రువులు నన్ను చుట్టిననూ – నరకపు పాశము లరికట్టిననూవరదవలె భక్తిహీనులు పొర్లినా – వదలకు నన్నుఎడబాయని దేవా ||యెహోవా నా||
చరణము 2
మరణపు టురTargetములు మరవక – మొరలిడ ఉన్నత దుర్గమైరక్షణ శృంగమై తన ఆలయములో నామొర వినెను అదిరెను ధరణిభయకంపముచే ||యెహోవా నా||
చరణము 3
నా దీపమును వెలిగించువాడు – నాచీకటిని వెలుగుగాచేర్చిన బలమైన దేవుడు ||యెహోవా నా||
చరణము 4
పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతములపునాదులువణకెను తన నోటి నుండి వచ్చిన అగ్ని – దహించి వేసెను వైరలనెల్లను ||యెహోవా నా||
చరణము 5
మేఘములపై ఆయన వచ్చును – మేఘములనుతన మాటుగ చేయును ఉరుముల మెరుపుల మెెండుగా చేసిఅపజయమిచ్చును అపవాదికిని ||యెహోవా నా||
చరణము 6
దయగలవారిపై దయచూపించును – ఖిన్నులయెడల వికటము చూపును గర్విష్ఠుల యొక్క గర్వము నణచునుసర్వము నెరిగిన సర్వాధికారి ||యెహోవా నా||
చరణము 7
నా కాళ్ళను లేడికాళ్ళుగా చేయును – ఎత్తైన స్థలములోశక్తితో నిలిపి రక్షణ కేడెము నాకందించి – అక్షయముగాతన పక్షము చేర్చిన ||యెహోవా నా||
చరణము 8
యెహోవా జీవము గల దేవా – బహుగా స్తుతులకు అర్హుడు నీవు అన్యజనులలో ధన్యత చూపుచు – హల్లెలూయాస్తుతిగానము చేసెద ||యెహోవా నా||