#681

మార్గము చూపుము ఇంటికి - నా తండ్రి ఇంటికి

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Category: రెండవ అనుబంధము · Open in the hymnal app

పల్లవి · Pallavi
మార్గము చూపుము ఇంటికి – నా తండ్రి ఇంటికిమాధుర్య ప్రేమ ప్రపంచము – చూపించు కంటికి (2)
చరణము 1
పాప మమతల చేత పారిపోయిన నాకు – ప్రాప్తిం చె శిక్షా క్షీణముపశ్చాత్తాపము నొంది తండ్రి క్షమగోరుచు – పంపుము క్షేమము – ప్రభు నీ సిలువముఖము చల్లిన నాకు పుట్టించె ధైర్యము
చరణము 2
ధనమే సర్వంబనుచు సుఖమేస్వర్గంబనుచు – తండ్రిని వీడితిధరణీభోగములెల్ల బ్రతుకు ధ్వంసము చేయు – దేహి నినుచేరితి –దేహి అని నీవైపు చేతులెత్తిననాకు దారిని చూపుము ||మార్గము||
చరణము 3
దూరదేశములోన బాగుందు ననుకొనుచు – తప్పితి మార్గముతరలిపోయిరి నేను నమ్మిన హితులెల్ల – తరిమెను దారిద్ర్యముదాక్షిణ్యమూర్తి నీదయ నాపై కురిపించి – ధన్యుని చేయుము ||మార్గము||
చరణము 4
అమ్ముకొంటిని నేను అధముడొక్కనికి నాడు –ఆకలి బాధలో అన్యాయమైపోయె పందులు సహ వెలివేయ – అలవడెనువేదన – అడుగంటి జనియె మానవత ఆశ్రయముగూర్చుము ||మార్గము||
చరణము 5
కొడుకునే కాదనుచు గృహమే చెరసాలలను – కోపించివెళ్ళితి – కూలివానిగనైన నీ ఇంట పనిచేసి – కనికరమేకోరుదు – కాదనకు నా తండ్రి దిక్కెవరును లేరు – క్షమియించుబ్రోవుము ||మార్గము||
చరణము 6
నా తండ్రి నన్ను గని పరుగెడుచు ఏతెంచి –నాపై బడి ఏడ్చెను నవజీవమును కూర్చి ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను– నా జీవిత కథయంత యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమై యుండును ||మార్గము||