#680

మధురం మధురం మధురం - యేసునాథ కథ మధురం

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Category: రెండవ అనుబంధము · Open in the hymnal app

పల్లవి · Pallavi
మధురం మధురం – యేసునాథ కథ మధురం ||మధురం||
చరణము 1
మధురమే మన ప్రభు యేసుని నామం – మానవాళికదేమాధుర్యము నామం – పాపిని బ్రోచెడి పావన నామం పరమున చేర్చేపరిశుద్ధనామం ||మధురం||
చరణము 2
మారని దేవుని మాటయే మధురం – మదిలో దలచిన కలతను తీర్చున్ – ఎదలో బాధను బాపున్ నిరతం – నమ్మిన నరులకు నెమ్మదిఇచ్చున్ ||మధురం||
చరణము 3
పగలు రేయి ప్రార్థించుటే మధురం పరిశుద్ధులసహవాసమేమధురం – అపొస్తలుల సద్బోధయే మధురం – మధురాతి మధురంపరిశుద్ధ రుధిరం ||మధురం||
చరణము 4
జంటితేనె ధారలకంటే – కమ్మనిది ప్రభు క్రీస్తునివాక్యం – ఆదియందు ఆ వాక్యమే యుండెన్ – వాక్యమేప్రియప్రభు యేసుగ మారెన్ ||మధురం||
చరణము 5
అందరిలో అతిసుందరుడతడు – ఆది దేవుని ఏకైక సుతుడుఆశ్చర్యకరుడా ఆలోచన కర్త – అవతరించె భువిన్ అందరికొరకే ||మధురం||
చరణము 6
యేసే క్రీస్తని యెరిగిన మేము – పరుగిడితిమి పాపము నుండి దూరం పొందితిమి ఆత్మానందభాగ్యం ప్రకటించుటేమాప్రధానధేయం ||మధురం||