#679
మణులు మాణిక్యములున్నా - మేడమిద్దెలు ఎన్న
పల్లవి · Pallavi
మణులు మాణిక్యములున్నా – మేడమిద్దెలు ఎన్నున్నామదిలో యేసు లేకున్నా – ఏది ఉన్నా అది సున్నా ||మణులు||
చరణము 1
చదువులెన్నో చదివున్నా – పదవులెన్నో చేస్తున్నావిద్యవున్నా బుద్ధివున్నా – జ్ఞానమున్నా అది సున్నా ||మణులు||
చరణము 2
అందచందా లెన్నున్నా – అందములపై కూర్చున్నాసుందరుడు ప్రభులేక యున్నా – అందమున్నా అది సున్నా ||మణులు||
చరణము 3
రాజ్యములు రమణులు ఉన్నా – శౌర్యములు వీర్యములున్నా – బలము ఉన్నా – బలగమున్నా ఎన్నివున్నాఅవి సున్నా ||మణులు||
చరణము 4
పూజ్యుడా పుణ్యాత్ముండా – పుణ్యకార్య సిద్ధుడాదానధర్మము జపము తపము – యేసులేనిది అదిసున్నా ||మణులు||