#678

ప్రియయేసు నిర్మించితివి - ప్రియమార నా హృ

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Category: రెండవ అనుబంధము · Open in the hymnal app

పల్లవి · Pallavi
ప్రియయేసు నిర్మించితివి – ప్రియమార నా హృదయంముదమార వసించు నా – హృదయాంతరంగమున
చరణము 1
నీ రక్త ప్రభావమున – నా రోత హృదయంబును పరిశుద్ధపరచుముతండ్రి – ప్రతిపాపమును కడిగి ||ప్రియ||
చరణము 2
అజాగరూకుడనైతిని – నిజ ఆశ్రయము విడిచికరుణారసముతో నాకై – కనిపెట్టితివి తండ్రి ||ప్రియ||
చరణము 3
వికసించె విశ్వాసంబు – వాక్యంబును చదువగనేచేరితి నీదు దారి – కోరి నడిపించుము ||ప్రియ||