#677
ప్రేమామృతధారలు చిందించిన యేసుకు సమమెవరు?
చరణము 1
ప్రేమామృతధారలు చిందించిన యేసుకు సమమెవరు?ఆ – ఆ – ఆ ప్రేమయై తానే నిలిచి – ప్రేమవాక్కులనే పలికిప్రేమతో ప్రాణము పెట్టి- ప్రేమనగరికి చనియె ||ప్రేమా||
చరణము 2
నిశ్చలమైన ప్రేమజీవికి – ఇలలో తావేదిప్రేమ ద్రోహులేగాని – ప్రియమున చేరరు వానిచేరిన చెలికాడగురా – సమయమిదే పరుగిడరా ||ప్రేమా||
చరణము 3
ఎంత ఘోరపాపాత్ములైన – ప్రేమించును రారాపాపభారముతో – రారా – పాదములపై పడరాపాపుల రక్షకుడేసు – తప్పక నిను రక్షించున్ ||ప్రేమా||
చరణము 4
ఇంత గొప్ప రక్షణను – నిర్లక్ష్యము చేసెదవేల?รక్షణ దిన మిదియేరా – తక్షణమే కనుగొనరాఇదియే దేవుని వరము – ముదమారగ జేకొనుము ||ప్రేమా||