#676

ప్రభువా! నే నిన్ను నమ్మి నిన్నాశ్రయించిన

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Category: రెండవ అనుబంధము · Open in the hymnal app

పల్లవి · Pallavi
ప్రభువా! నే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినానునరులేమి చేయగలరు భయమేమిలేదు నాకు
చరణము 1
గర్విష్టులైనవారు – నాతో పోరాడుచుండప్రతిమాట కలవారూ – పరభావ మెంచుచుండప్రభువా నా ప్రక్కనుండి – నన్ను తప్పించినావు ||ప్రభువా||
చరణము 2
నేనెందు పోదుమన్నా – గమనించుచుండువారు నా వెంట పొంచియుండి – నన్ను కృంగదీయనెంచప్రభువా! నా ప్రక్కనుండి – నన్ను తప్పించినావు ||ప్రభువా||
చరణము 3
పగబూని వారు నన్ను – హతమార్చ నెంచియున్నమరణంబునుండి నన్ను కడు వింత రీతిగానూప్రభువా! నా ప్రక్క నుండి – నన్ను తప్పించినావు ||ప్రభువా||
చరణము 4
జీవంపు వెలుగైన – నీ సన్నిధానమందునే సంచరించునట్లు – నే జారిపోకుండాప్రభువా! నా ప్రక్కనుండి – నన్ను తప్పించినావు ||ప్రభువా||
చరణము 5
నన్నాదుకొంటి నీవు – నన్నాదరించినావుకొన్నావు నీవు నన్ను – మన్నించినావు నీవుఎన్నాళ్ళు బ్రతికియున్న – నిన్నే సేవింతు దేవా! ||ప్రభువా||