#675
ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో
పల్లవి · Pallavi
ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములోపరికించిన శుభదినము గమనించిన యాక్షణముపరలోకముకై చిరజీవముకై – ప్రార్థించెను నా హృదయముప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించె ||ప్రభు||
చరణము 1
దిశలన్నియు తిరిగితిని నాపాపపు దాహముతోదౌష్ట్యములో మసలుచును దౌర్జన్యము చేయుచునుధనపిపాసతో మృగవాంఛలతో దిగజారితి చావునకు ||ప్రభు||
చరణము 2
యేసు నీ రాజ్యములో భువి కేతెంచెడి రోజు ఈపాపిని క్షమియించి జ్ఞాపకముతో బ్రోవుమనిఇల వేడితిని విలపించుచును ఈడేరును నా వినతి ||ప్రభు||
చరణము 3
పరదైనను ఈ దినమే నా ఆనందముతోనూపాలోంగెదవు నీవనుచు వాగ్దానము చేయగనే (2)పరలోకమే నా తుది ఊపిరిగా పయనించితి ప్రభుకడకు ||ప్రభు||