#674
ప్రభు ప్రేమ తొలికేక - హృదయములో ప్రతిధ్వన
పల్లవి · Pallavi
ప్రభు ప్రేమ తొలిరేక – హృదయములో ప్రతిధ్వనించేపాపక్షమ యేసునిలో – శరణు నొసంగుచు కనిపించే
చరణము 1
పాపవికారము పొడచూప – జీవితవిలువలు మరుగాయెఫలితముగా లోకములో – బ్రతుకుటయే నా గతియాయెపలువురిలో కనబడలేక – దాహముతో నేనొంటరిగాబావికని పయనింప – నాథుని దర్శనమెదురాయెపావనుడు దాహముతో – జలమును ఇమ్మని నన్నుగోరె ||ప్రభు||
చరణము 2
జాతిని చూడని నేత్రముతో – పాపము శోకము హృదయముతోజాలిని చాటించుచునే – తాకెను నామది వేదనతోజాప్యము చేయక తెమ్మనియే – దాచుకొనిన నాపాపమునుజడియుచునే తెలిపితిని – ప్రభు వెరిగిన నా నిజస్థితినిజయమొందె నాతనువూ – సరిగ నుడితివని ప్రభు తెలుపగా ||ప్రభు||
చరణము 3
దేహమునే నాసర్వముగా – భావించుచు మది పూజింపదినదినమూ జీవితమూ – చావుగా మారిన కాలములోదేవునిగా నా బంధువుగా – మరణ ప్రవాహము ఛేదించిదరిజేర్చి దీవించి – నూతన జన్మ ప్రసాదించేదయ్యాళ్లకు హరమును – స్తుతి మందిరముగా రూపించే ||ప్రభు||
చరణము 4
పాపము దాగును నాబావి – లోతును చూచినదెవరుపోరాటవాటికయై – నా బ్రతుకును ఎరిగినవారెవరుపాపికిని పాపమునకునూ – భేదము చూపినవారెవరుపాపిని కాపాడుటకు – సిలువను మోసినవారెవరుప్రకటించె దైవకృప – తెరిచెను జీవన జలనిధులు ||ప్రభు||
చరణము 5
ఘటముతో వెడలితి నొంటరిగా – పితరుల తాతల జనములకైకనబడెను బావికడ – రక్షణయూటల ప్రభుయేసుకుండను వీడి పరుగిడితి బావిని గని చొని హృదయములోఘనమైన శుభవార్త – ఆతృప్తతతో ప్రజలకు తెలుపగ్రామప్రజా కనుగొనిరి – విశ్వవిమోచకుడగు యేసున్ ||ప్రభు||