#673
ప్రజలారే వేగమే రారే - నిజదైవమును కనుగొనర
పల్లవి · Pallavi
ప్రజలారే వేగమే రారే – నిజదైవమును కనుగొనరారే ||
అనుపల్లవి · Anupallavi
ప్రతివాడు మోక్షము చేర – ప్రభు యేసు వార్తను వినరారే ||
చరణము 1
పాపాత్ములనబడువారి – భారంబు తీయనగోరిప్రభు యేసు చూపిన దారి – పరమందు సుఖమిడు దారి ||ప్రజలారే||
చరణము 2
ఏ జాతివారలైనన్ – యే దేశవాసులైనన్ఏమైన భేదము లేక – యేసయ్య బ్రోచును వేగ ||ప్రజలారే||
చరణము 3
పాపాత్ములే తన సుతులు – प्रभु యేసునికి స్నేహితులునీ పాపమెల్లను బోయెన్ – నీకింక మోక్షము కలుగున్ ||ప్రజలారే||
చరణము 4
ప్రయాసపడి భారమును – మోసెడు ఓ ప్రజలారాప్రభుయేసుక్రీస్తే మీకు – విశ్రాంతి నిచ్చును రండి ||ప్రజలారే||
చరణము 5
యేసయ్యగాకను వేరే – యెవరైనా లేరిక రారేదోషంబులెక్కిన బాపి – ఆశీర్వదించును గాచి ||ప్రజలారే||