#672
పాడెదన్ దేవా - నీ కృపలన్ - నూతన గీతములన్
పల్లవి · Pallavi
పాడెద దేవా – నీ కృపలన్ – నూతన గీతములన్స్తోత్రము చెల్లింతున్ (2) ఆ..ఆ..ఆ...(2)
చరణము 1
భూమి పునాదులు వేయకముందే యేసులో చేస్తివిప్రేమ పునాదులు వేస్తివి దీనుని బ్రోచితివి ఈ దీనుని బ్రోచితివి ||పాడెద||
చరణము 2
ప్రవిమల రక్తము కల్వరి సిలువలో కలుషునకు నిచ్చితివిప్రేమకృప మహా ఐశ్వర్యములతో పాపము తుడిచితివి నా పాపము తుడిచితివి ||పాడెద||
చరణము 3
పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివిఅపరాధముల చే చచ్చిన నన్ను ధరణి బ్రతికించితివి నన్ను బ్రతికించితివి ||పాడెద||
చరణము 4
దేవుని రాజ్యపు వారసుడనుగా క్రీస్తులో చేసితివి చీకటి రాజ్యపు శక్తుల నుండి నన్ను విడిపించితివి చెరవిడిపించితివి ||పాడెద||
చరణము 5
ముద్రించితివి శుద్ధాత్మతో నన్ను భద్రము చేసితివి సత్యస్వరూపి నిత్యనివాసి సొత్తుగా చేసితివి నీ సొత్తుగా చేసితివి ||పాడెద||
చరణము 6
అన్యుడనై నిన్ను ఎరుగకయున్నను ధన్యుని చేసితివిప్రియపట్టణ పౌరుల సేవింపను వరముల నొసగితివి కృప వరముల నొసగితివి ||పాడెద||