#671
యేసు చాలును - యేసు చాలును ఏ సమయమైన ఏ స్థ
పల్లవి · Pallavi
యేసు చాలును – యేసు చాలునుఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును
చరణము 1
పరమజీవము నాకు నివ్వ – తిరిగి లేచెను నాతో నుండనిరంతరము నన్ను నడిపించును – మరల వచ్చి యేసు కొని పోవును ||యేసు||
చరణము 2
సాతాను శోధనలధికమైన – సొమ్మసిల్లక సాగి వెళ్ళెదనులోకము శరీరము లాగిననూ – లోబడక నేను వెళ్ళెదను ||యేసు చాలును||
చరణము 3
పచ్చిక బయలులో పరుండజేయును – శాంతి జలము చెంత నడిపించును – అనిశము ప్రాణము తృప్తిపరచును – మరణ లోయలో నన్ను కాపాడును ||యేసు చాలును||
చరణము 4
నరులందరు నన్ను విడిచినను – శరీరము కుళ్ళి కృశించిననుహరించినను నా ఐశ్వర్యము – విరోధివలె నన్ను విడిచినను ||యేసు చాలును||