#668
నా సంకటంబులన్నియు పోయె - సంహారదూత నన్ను
పల్లవి · Pallavi
నా సంకటంబులన్నియును పోయెసంహారదాత నన్ను దాటిపోయె
చరణము 1
గొర్రెపిల్ల విలువైన రక్తములోకడుగబడి నేను రక్షణ బొందితిన్ ||నా సంకట||
చరణము 2
ఫరోకు నేనింక దాసుడను కానుపరమకానానుకు హక్కుదారుడను ||నా సంకట||
చరణము 3
మారాను మధురముగా మార్చినాకుబండను పగులగొట్టి దాహము తీర్చెను ||నా సంకట||
చరణము 4
మనోహరముగానున్న కానాన్ రాజ్యమేఅదే నాకు స్థిరమైన అవకాశము ||నా సంకట||
చరణము 5
ఆనందమే పరమానందమేకానాన్ జీవితము నాకు ఆనందమే ||నా సంకట||
చరణము 6
అరణ్యజీవితమున యేసు నాయకుడుప్రతిదినము నూతన మన్నా ఆయన ఇస్తాడు ||నా సంకట||
చరణము 7
నా బలము నా ఆశ్రయమునా రక్షణ యేసయ్య – హల్లెలూయా ||నా సంకట||