#669
నీ చేతితో నన్ను పట్టుకో - నీ ఆత్మతో నన్న
పల్లవి · Pallavi
నీ చేతితో నన్ను పట్టుకో – నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పిచేతిలో శిలను నేను – అనుక్షణము నన్ను చెక్కుము
చరణము 1
అంధకార లోయలోన – సంచరించిన భయము లేదునీ వాక్యమ శక్తిగలది – నా త్రోవకు నిత్యవెలుగు ||నీ చేతితో||
చరణము 2
ఘోరపాపిని నేను తండ్రి – పాప ఊబిలో పడియుంటినిలేవనెత్తుము శుద్ధిచేయుము – పొంద నిమ్ము నీదు ప్రేమను ||నీ చేతితో||
చరణము 3
ఈ భువిలో రాజు నీవే – నా హృదిలో శాంతి నీవేకుమ్మరించుము నీదు ఆత్మను – జీవితాంతము సేవ చేసెదన్ ||నీ చేతితో||