#667
నా ప్రియ యేసునిపై ఆనుకొని - అరణ్య మార్గమ
పల్లవి · Pallavi
నా ప్రియ యేసునిపై ఆనుకొని – అరణ్య మార్గముననడుచుటయే – ఆనంద జీవితము ||నా నా||
చరణము 1
లిల్లీపుష్పం శారోనురోజ – పరిశుద్ధమైన మాదు తండ్రిపూర్ణరూప సౌందర్యుడే – కీర్తింపతగిన దేవ ||నా నా||
చరణము 2
కన్యకలు ప్రేమించు దేవ – నా ప్రభు నామము పరిమళమేయేసుని వెనుక వచ్చితిమి – నన్ను ఆకర్షించెను ||నా నా||
చరణము 3
ప్రేమధ్వజ మెగురుచుండగ – ప్రియుని సముఖము కలుగుటచే జల్లరువృక్షము క్రింద కలిగెను – ప్రియుని ఆదరణ ||నా నా||
చరణము 4
నిద్రించు రాత్రి సమయమునందు – నిత్యం నా ఆత్మ మేల్కొనినా తలుపు నొద్ద నిలిచిన – యేసుని ప్రేమించెదన్ ||నా నా||
చరణము 5
అగ్నిజ్వాల యేసుని ప్రేమ – మరణమువలె బలవంతమైనదినీటి ప్రవాహమువలన – ఆ ప్రేమ చల్లారదు ||నా నా||
చరణము 6
దీనస్తంభము వలె దిగివచ్చును – దేవకుమారుడు మహిమతోఘనులైన వారి రథమువలె పై కెగరిపోదును ||నా నా||