#666

నా ప్రాణప్రియుడా యేసు రాజా అరిపింతును నా

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Category: రెండవ అనుబంధము · Open in the hymnal app

పల్లవి · Pallavi
నా ప్రాణప్రియుడా యేసు రాజా అరిపింతును నా – ހృదయార్పణవిరిగి నలిగిన ఆత్మతోనూ హృదయపూర్వక ఆరాధనతో – సత్యముగా
చరణము 1
అద్భుతకరుడా ఆలోచన – ఆశ్చర్య సమాధాన ప్రభువాబలవంతుడా బ..హు ప్రియుడామనోహరుడా మహిమరాజా – స్తుతించెదన్ ||నా ప్రాణ||
చరణము 2
విమోచనగానములతో – సౌందర్య ప్రేమ స్తుతులతోనమస్కరించి ఆరాధింతున్హర్షింతును నే పాడెదను – నా ప్రభువా ||నా ప్రాణ||
చరణము 3
గర్భమున పుట్టిన బిడ్డలన్ – కరుణింపక తల్లి మరచునామరచినగాని నీవెన్నడుమరువవు విడువవు ఎడబాయవు – కరుణ రాజా ||నా ప్రాణ||
చరణము 4
రక్షణా అలంకారములను – అక్షయమగు నీ యాహారమునురక్షకుడా – నా కొసగితివిదీక్షతో నిన్ను వీక్షించుచు – స్తుతింతును ||నా ప్రాణ||
చరణము 5
నీ నీతిని నీ రక్షణను – నా పెదవులు ప్రకటించునుకృతజ్ఞతాస్తు...తులతోడ నీ ప్రేమను నేవివరింతును – విమోచకా ||నా ప్రాణ||
చరణము 6
వాగ్దానములు నాలో నెరవేరెన్ – విమోచించి నా కిచ్చితివిపాడెదను ప్రహర్షింతునుహల్లెలూయా – హల్లెలూయా ||నా ప్రాణ||