#663

నరకముననునది - నిరంతరముండునయ్యో ఆ ఘోరనరకమ

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Category: రెండవ అనుబంధము · Open in the hymnal app

చరణము 1
నరకమనునది – నిరంత ముండునయ్యోఆ ఘోర నరకము – నందు పాపులు బాధపడుదురయ్యోమరియు అగ్ని పురుగులందున – కొరుకు చుండును తరుగులేకనూధరణికాదిది దరియు కాదు – మరణమెదికిన దొరకదందున ||నరక||
చరణము 2
గప్పు గప్పున రగులుచుండునయ్యో – ఆ ఘోర నరకము నిప్పు లెగయుచు –పొంగుచుండునయ్యో మబ్బువలె పొగ పైకి లేచును –అబ్బా! అబ్బాని యేడుచుందురు బొబ్బలిడుదురు అడ్డమొచ్చెడి –అబ్బలెవరు కానరందున ||నరక||
చరణము 3
నోరులెత్తి కొట్టుకొందురయ్యో – ప్రభు యేసు క్రీస్తునునమ్మనందుకు నొచ్చుకొందురయ్యో – పురుగు చావదు అగ్ని ఆరదుకొరుకుచుందురు – పండ్లు పటపట తిరిగితిరిగి చూచుచుందురు– పరుగులెత్తక యేడుచుచుందురు ||నరక||