#662

నమ్మవద్దు నమ్మవద్దు ఈ మాయా లోకం - నమ్మవద

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Category: రెండవ అనుబంధము · Open in the hymnal app

పల్లవి · Pallavi
నమ్మవద్దు – నమ్మవద్దు ఈ మాయా లోకం – Nమ్మవద్దుఇది – ఆశ చూపి మోసం చేయు – ఈ మాయాలోకం గనుక ||నమ్మవద్దు||
చరణము 1
మిమ్మునుగన్న తల్లి ఏది – మిమ్మునుగన్న తండ్రియేడినాతోడ బుట్టిన తోడులు ఏరి – వారిన్కాటికి మోసిన కోటప్ప లేరి – గనుక ||నమ్మవద్దు||
చరణము 2
మీరు కట్టిన యిండ్లు ఏవి మీరు – కట్టిన కోటలు ఏవి – కొట్టితిన్న పొట్టలు ఉన్నవా?మెట్టలు పల్లాలు అవ్వక మానునా – గనుక ||నమ్మవద్దు||
చరణము 3
మీరు త్రవ్విన బావులు ఏవి – మీరు త్రాగిన నదులు ఏవిఏరులు ఎండుకుండునా? కారులు మరచిపోకుండునా – గనుక ||నమ్మవద్దు||
చరణము 4
scan మీరు కట్టిన బట్టలు – ఏవి – చుట్టి త్రాగిన చుట్టలు ఏవి –కట్టినబట్ట మట్టికెక్కే కదా? చుట్టిన చుట్ట అగ్గికే కదా – గనుక ||నమ్మవద్దు||
చరణము 5
మనం మంటి నుండి తీయబడితిమి – మంటితో పుట్టబడితిమి – ఎట్టి బ్రతుకుబ్రతికినగాని కట్టె కాటికి పదపదరన్నా – గనుక ||నమ్మవద్దు||
చరణము 6
యేసు ప్రభుని నమ్మండిప్పుడే – మోసపోకుడి ఈ ధరణిలో – ప్రయాసపడిభారమును మోసెడి ఓ ప్రజలారా – గనుక ||నమ్మవద్దు||