#661

నడిపించు నా నావ - నడిసంద్రమున దేవా నవజీవ

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Category: రెండవ అనుబంధము · Open in the hymnal app

పల్లవి · Pallavi
నడిపించు నా నావ – నడిసంద్రమున దేవానవజీవన మార్గమున – నా జన్మ తరియింప ||నడిపించు||
చరణము 1
నా జీవిత తీరమున – నా అపజయ భారముననలిగిన నా హృదయమును – నడిపించు లోతునకునా యాత్మ విరిబూయ – నా దీక్ష ఫలియింపనా నావలో కాలిడుము – నా సేవ చేకొనుము ||నడిపించు||
చరణము 2
రాత్రంతయు శ్రమపడినా – రాలేదు ప్రభు జయమురహదారులు వెదకిననూ – రాదాయెను ప్రతిఫలమురక్షించు నీ సిలువ – రమణీయ లోతులలోరత్నాలను వెదకుటలో – రాజిల్లు నా పడవ ||నడిపించు||
చరణము 3
ఆత్మార్పణ చేయకయే – ఆశించితి నీ చెలిమిఅహమును ప్రేమించుచునే – అన్వేషించితి ప్రభు నీ కలిమిఆశ నిరాశయై – ఆవేదన ఎదురాయెఆధ్యాత్మిక లేమిగని – అల్లాడె నా వలలు ||నడిపించు||
చరణము 4
ప్రభు మార్గము విడిచితిని – ప్రార్థించుట మానితినిప్రభు వాక్యము వదలితిని – పరమార్థము మరచితినిప్రపంచ నటనలలో – ప్రావీణ్యమును బొందిఫలహీనుడనై యిప్పుడు – పాటింతు నీ మాట ||నడిపించు||
చరణము 5
లోతైన జలములలో – లోతున వినబడు స్వరమాలోబడుటను నేర్పించి – లోపంబును సవరించిలోనున్న ఈవులలో – లోతైన నా బ్రతుకులోపించని అర్పణగా – లోకేశ చేయుమయ ||నడిపించు||
చరణము 6
ప్రభు యేసుని శిష్యుడనై – ప్రభు ప్రేమలో పాదుకొనిప్రకటింతును లోకములో – పరిశుద్ధుని ప్రేమకథపరమాత్మ ప్రోక్షణతో – పరిపూర్ణ సమర్పణతోప్రాణంబును ప్రభు కొరకు – పానార్పణము చేయుదు ||నడిపించు||