#660

దొరుకుతావురా సహోదరా! దొరుకుతావురా నీవు త

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Category: రెండవ అనుబంధము · Open in the hymnal app

పల్లవి · Pallavi
దొరుకుతావురా సహోదరా! దొరుకుతావురా నీవుతరిమి తరిమి కీడుచేయ – పరుగెత్తినగాని తుదకు ||దొరుకు||
చరణము 1
చిన్న చూపు చూచి తమ్ముని – కన్నెర్ర జేసి చంపినగానిఅన్న కయీను దేవుని – హస్తమునకు దొరికిన రీతిగా ||దొరుకు||
చరణము 2
వరములు పొందిన తమ్ముని – చంపవలయునని పంతముగబట్టినరకమొచ్చి లోబడి యేడ్చిన – దురిత చరితుని ఏశావువలె ||దొరుకు||
చరణము 3
భక్త దావీదును బట్టి – ప్రాణము తీయదలచిన తనశక్తితో తరిమిన రాజగు – సౌలు దొరికిన రీతిగానూ ||దొరుకు||
చరణము 4
విగ్రహమునకు మ్రొక్కని దైవ – పిల్లల నగ్నిలో పడవేసిఆగ్రహించిన నెబుకద్నెజరు – గడ్డిమేసి దొరికిన విధముగ ||దొరుకు||
చరణము 5
క్రైస్తవులను బట్టి కొట్టి – ఖైదులో వేయదలచిననూవాస్తవమగు వెలుగును జూసి – ప్రభువును చాటిన పౌలుబోలి ||దొరుకు||
చరణము 6
కీడుచేయబోకు మెప్పుడు – కీడు నీకే కీడు కీడుキーడు చేసిన మేలు చేసి – కీడును జయించకపోతే ||దొరుకు||
చరణము 7
మాటలు కుదిరితే మాటలు – కోటలు కుదురును నీకుమాటలలో లోటుంటే – నోటిమాట తప్పకుండా ||దొరుకు||
చరణము 8
దొంగతనము వ్యభిచారమునకు – లొంగి శాపగ్రస్తులైదొంగిలించిన దశమభాగమే – లొంగుట కారణమని తుదకు ||దొరుకు||
చరణము 9
కొంత యిచ్చిన దశమభాగము – అంతయు ఇదియని తప్పుకొన్నకొంత యిచ్చిన కయీనువలె – కొంత యిచ్చిన అననియవలె ||దొరుకు||
చరణము 10
చెడుగు చేసి బదులు దానిని – చేసినారని చెప్పమన్న వడిగదేవుని న్యాయమనెడి – పరమ త్రాసులో నిలువండి ||దొరుకు||