#659
దేవుని స్తుతించుడి - ఎల్లప్పుడు దేవుని స
పల్లవి · Pallavi
దేవుని స్తుతియించుడి – ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ||దేవుని||
చరణము 1
ఆయన పరిశుద్ధ ఆలయమందు – ఆయన సన్నిధిలో ఆ ఆ ||దేవుని||
చరణము 2
ఆయన బలమును ప్రసిద్ధి చేయు – ఆకాశ విశాలమందు ఆ ఆ ||దేవుని||
చరణము 3
ఆయన పరాక్రమ కార్యములను బట్టి – ఆయన ప్రభావమును ||దేవుని||
చరణము 4
బూరధ్వనితో ఆయనను స్తుతియించుడి – స్వరమండలముతో ఆ ఆ ||దేవుని||
చరణము 5
సన్నతంతుల సితారతోనూ – చక్కని స్వరములతో ||దేవుని||
చరణము 6
తంబురతోనూ – నాట్యముతోనూ తంత్రి వాద్యముతోనూ ఆ ఆ ||దేవుని||
చరణము 7
పిల్లనగ్రోవులు చల్లగనూది – ఎల్లప్రజలు చేరి ||దేవుని||
చరణము 8
మ్రోగుతాళములతో ఆయనను స్తుతియించుడి – గంభీర తాళముతో ఆ ఆ ||దేవుని||
చరణము 9
సకల ప్రాణులు యెహోవాను స్తుతియించుడి – హల్లెలూయాఆమెన్ ఆ ఆ హల్లెలూయా ఆమెన్ ఎల్లప్పుడు ||దేవుని||