#658

దేవుని వారసలం - ప్రేమ నివాసలము జీవన యాత్

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Category: రెండవ అనుబంధము · Open in the hymnal app

పల్లవి · Pallavi
దేవుని వారసులం – ప్రేమ నివాసలము జీవన యాత్రికులంయేసుని దాసులము – నవయుగ సైనికులం – పరలోక పౌరులము హల్లెలూయా – నవయుగ
చరణము 1
దారుణ హింసలలో – దేవుని దూతలుగాఆరని జ్వాలలో – అగ్ని జయములతో – మారని ప్రేమసమర్పణతో – సర్వత్ర యేసును కీర్తింతము ||దేవుని||
చరణము 2
పరిశుద్ధాత్మునికై – ప్రార్థన సలుపుదాముపరమాత్ముని రాక – బలము ప్రసాదింప – ధరణిలో ప్రభువునుచూపుటకై సర్వాంగహోమము చేయుదము ||దేవుని||
చరణము 3
అనుదిన కూటములు – అందరి గృహములలోఆనందముతోను ఆరాధనలాయె – వీనులవిందగు పాటలతోధ్యానము చేయుచు మరియుందుము ||దేవుని||
చరణము 4
సజీవ సిలువ ప్రభు సమాధి గెలుచుటచే విజేత ప్రేమికులం – విధేయ బోధకులం – నిజముగ రక్షణప్రబలుటకై – ధ్వజముగ సిలువను నిలుపుదాము ||దేవుని||
చరణము 5
గోధుమ గింజవలె – క్రీస్తుడు చావగనూ నాథుని మరణములో – శాశ్వత జీవమును – నిధులుగా పండించిలేవగనూ – మాధుర్య రక్షణ లభించెను ||దేవుని||
చరణము 6
హతసాక్షుల కాలం – అవనిలో చెలరేగె గతకాలపు సేవ – గొల్గొత్తా గిరి – వీధులలో బహురీతులలోనూతన లోకము కాంక్షింతుము ||దేవుని||
చరణము 7
ప్రభువును చూచుటకై – ప్రజలందరు రాగ విభు మహిమను గాంచ విశ్వమేమవగోర – శుభములుగూర్చుచు మాలో – శోభిల్లు యేసును చూపుదాము ||దేవుని||