#657

దేవునికి స్తోత్రము గానము - చేయుటయే మంచిద

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Category: రెండవ అనుబంధము · Open in the hymnal app

పల్లవి · Pallavi
దేవునికి స్తోత్రము గానము – చేయుటయే మంచిదిమనమందరము స్తుతి గానము – చేయుటయే మంచిది
చరణము 1
యెరూషలేము యెహోవాయే – కట్టుచున్నవాడని (2)ఇశ్రాయేలీయులను పోగుచేయువాడని ||దేవునికి||
చరణము 2
గుండె చెదరిన వారిని – బాగుచేయువాడనివారి గాయములన్నియు – కట్టుచున్నవాడని ||దేవునికి||
చరణము 3
నక్షత్రముల సంఖ్యను – ఆయన నియమించునువాటికన్నియు పేరులు – పెట్టుచున్నవాడని ||దేవునికి||
చరణము 4
ప్రభువు గొప్పవాడును – అధిక శక్తి సంపన్నుడుజ్ఞానమునకు ఆయనే – మితియు లేనివాడని ||దేవునికి||
చరణము 5
దీనులకు అండాయనే – భక్తిహీనుల కూల్చునుసితారాతో దేవుని – స్తుతులతో కీర్తించుడి ||దేవునికి||
చరణము 6
ఆయన ఆకాశమును – మేఘములతో కప్పునుభూమి కొరకు వర్షము – సిద్ధపరచువాడని ||దేవునికి||
చరణము 7
పర్వతములలో గడ్డిని – పశువులకు మొలిపించెనుఅరచు పిల్లకుక్కలకును – ఆహారము తానిచ్చును ||దేవునికి||
చరణము 8
గుర్రముల నరులందరి – బలము నా నందించడుకృప వేడు వారిలో – సంతోషించువాడని ||దేవునికి||
చరణము 9
యెరూషలేము యెహోవాను – సీయోను నీ దేవునికీర్తించుము కొనియాడుము – ఆనందించువాడని ||దేవునికి||
చరణము 10
పిల్లలన ఆశీర్వదించియు – బలపరచు నీ గుమ్మముల్మంచి గోధుమ పంటతో – నిన్ను తృప్తిపరచును ||దేవునికి||
చరణము 11
భూమికి తన యాజ్ఞను – ఇచ్చువాడు ఆయనేవేగముగాను దేవుని – వాక్యము పరుగెత్తును ||దేవునికి||
చరణము 12
వాక్యమును యాకోబుకు తెలియజేసినవాడనిఏ జనయు ఈలాగున – చేసియుండ లేదని ||దేవునికి||