#656

దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగానున్నాడు

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Category: రెండవ అనుబంధము · Open in the hymnal app

పల్లవి · Pallavi
దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు (3)
చరణము 1
ఏదెనులో ఆదాముతో నుండెను – హనోకుకు తోడై నడిచెనుదీర్ఘదర్శకులతో నుండెను – ధన్యులు దేవుని గలవారు ||తోడుగ||
చరణము 2
దైవాజ్ఞను శిరసావహించి – దివ్యముగా అబ్రాహాము – కన్న కొమరునిఖండించుటకు – ఖడ్గము నెత్తిన యప్పుడు ||తోడుగ||
చరణము 3
యోసేపు ద్వేషించబడినప్పుడు – గోతిలో త్రోయబడినప్పుడుశోధనలో చెరసాల యందు సింహాసన మెక్కినయప్పుడు ||తోడుగ||
చరణము 4
ఫరోరాజు తరిమిన యప్పుడు – ఎర్రసంద్రపు తీరమున యోర్దానునదిదాటునప్పుడు – యెరికో కూలినయప్పుడు ||తోడుగ||
చరణము 5
దావీదు సింహము నెదిరించి – ధైర్యమున నిల్చిన యప్పుడుగొల్యాతును హతమార్చినప్పుడు – సౌలు చేత తరుమబడినప్పుడు ||తోడుగ||
చరణము 6
సింహపు బోనులో దానియేలు – షద్రకు మేషాకు అబేద్నెగో అగ్నిగుండములో వేయబడెను – నలుగురుగా కనబడినప్పుడు ||తోడుగ||
చరణము 7
పౌలు బంధించబడినప్పుడు – పేతురు చెరసాలలోనున్నప్పుడుఅపొస్తలుల విశ్వాసులు – హింసించబడినయప్పుడు ||తోడుగ||