#653
జీవితమంత నీ ప్రేమగానం ప్రణుతింతుము యేసుద
పల్లవి · Pallavi
జీవితమంత నీ ప్రేమగానం ప్రణుతింతుము యేసుదేవాప్రచురింతుము మేము – నీ కీర్తిన్ – ఆనందగానంబుతో ||జీవితమంత||
చరణము 1
సర్వ సమయములలో నీ స్తుతి గానం – ఎల్లా వేళలయందు నీ నామధ్యానంమాకిదియే మేలు – ఈ జీవితమున – స్తుతియింతు నా రక్షకా ||జీవితమంత||
చరణము 2
సృష్టినంతటినీ నీ మాటచేత – సృజియించితివిగా మా దేవదేవానీ ఘనమగు మహిమను – వర్ణింప తరమా – స్తుతియింతు నా రక్షకా ||జీవితమంత||
చరణము 3
కలుషితాత్ములమైన మా కొరకు నీ – విలువైన ప్రాణంబునర్పించితివిగా కలవరి గిరిపై చూపిన ప్రేమను – స్తుతియింతు నా రక్షకా ||జీవితమంత||
చరణము 4
పరిశుద్ధమైన నీ సన్నిధిలో – శాశ్వతమైన నీ రాజ్యాంబులోప్రేమతో నన్ను చేర్చుకొంటివిగా – స్తుతియింతు నా రక్షకా ||జీవితమంత||