#652
జయ విజయమని పాడుదమా - జయ విజయుడగు యేసునకు
పల్లవి · Pallavi
జయ విజయమని పాడుదమా – జయ విజయుడగు యేసునకుఅపజయమెరుగని దేవునకు జయ స్తోత్రం స్తుతి చేయుదమా ||జయ||
చరణము 1
ఇహమందు పలు ఆపదలు ఎన్నో కలిగిననూనా హస్తములు పట్టుకొని వడివడిగా నన్ను నడిపించును ||జయ||
చరణము 2
మహాదయాళుడు యెహోవా నా పాపములన్నింటినీ కరుణించినా పాపములన్నింటినీ మన్నించి మలినము తొలగించును ||జయ||