#651
జయ జయ యేసు జయ యేసు - జయ జయ క్రీస్తు జయ క
పల్లవి · Pallavi
జయ జయ యేసు జయయేసు – జయజయ క్రీస్తు జయక్రీస్తుజయజయరాజా జయరాజా – జయజయ స్తోత్రం జయస్తోత్రం ||జయ||
చరణము 1
మరణము గెల్చిన జయయేసు – మరణము ఓడెను జయయేసుపరమ బలమొసగు జయయేసు – సమాధి ఓడెను జయయేసు ||జయ||
చరణము 2
సమాధి గెల్చిన జయయేసు – సమాధి ఓడెను జయయేసుక్షమించుము నన్ను జయయేసు – అమరమూర్తి జయయేసు ||జయ||
చరణము 3
సాతాను గెల్చిన జయయేసు – సాతాను ఓడెను జయయేసుపాతాళము జయించిన జయయేసు – దాతవు నీవే జయయేసు ||జయ||
చరణము 4
బండను గెల్చిన జయయేసు – బండయు ఓడెను జయయేసుబండలు తీయుము జయయేసు – అండకు ఓడెను జయయేసు ||జయ||
చరణము 5
ముద్రను గెల్చిన జయయేసు – ముద్రయు ఓడెను జయయేసుముద్రలు చీల్చుము జయయేసు – ముద్రించుము నన్ను జయయేసు ||జయ||
చరణము 6
కావలి గెల్చిన జయయేసు – కావలి ఓడెను జయయేసుసేవలో బలమును జయయేసు – జీవము నీవే జయయేసు ||జయ||
చరణము 7
దయ్యాల గెల్చిన జయయేసు – దయ్యాలు ఓడెను జయయేసుకాయము కలిగిన జయయేసు – అయ్యో నీవే జయయేసు ||జయ||