#650
చూడుము గెత్సేమనే - తోటలో నా ప్రభువు పాపి
పల్లవి · Pallavi
చూడుము గెత్సేమనే – తోటలో నా ప్రభువు పాపి నాకైవిజ్ఞాపన చేసెడి – ధ్వని వినబడుచున్నది పాపి నీకై విజ్ఞాపన చేసెడి – ధ్వనివినబడుచున్నది
చరణము 1
దేహమంతయు నలిగి – శోకము చెందినవాడైదేవాది దేవుని – ఏకైక సుతుడు పడు వేదనలు నా కొరకే ||చూడుము||
చరణము 2
తండ్రి ఈ పాత్ర తొలగున్ – నీ చిత్తమైన యెడలఎట్లయినను నీ – చిత్తము చేయుటకు నన్నప్పగించుదుననెను ||చూడుము||
చరణము 3
రక్తపు చెమట వలన – మిక్కిలి బాధనొందిరక్షకుడేసు – హృదయము పగులగా – విజ్ఞాపనము చేసెనే ||చూడుము||
చరణము 4
ముమ్మారు భూమిమీదపడి మిక్కిలి వేదనచే – మన యేసుప్రभुవు – తానే వేడుకొనెను – పాపుల విమోచన కొరకే ||చూడుము||
చరణము 5
ప్రేమామృత వాక్కులచే – ఆదరించెడి ప్రభువు – వేదనసమయమున – బాధపరచెడి వారి కొరకు ప్రార్థన చేసెనే ||చూడుము||
చరణము 6
నన్ను తనవలె మార్చెడి – ఈ మహా ప్రేమను తలచితలచి హృదయము కరుగగా – సదా కీర్తించెదను ||చూడుము||