#649
గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము
పల్లవి · Pallavi
గీతం గీతం జయజయగీతం చేరి అట్లె పాడెదము
అనుపల్లవి · Anupallavi
యేసురాజు లేచెనని హల్లెలూయ జయమార్భటం చేసెదము
చరణము 1
చూడు సమాధిని మూసిన రాయి దొర్లింపబడెను – అందువేసిన ముద్ర కావలి నిల్చెనా – దైవ సుతుని ముందు ||గీతం||
చరణము 2
వలదు వలదు ఏడువవలదు – వెళ్ళుడి గలిలయకు – తానుచెప్పిన విధమున తిరిగి లేచెను – పరుగిడి ప్రకటించుడి ||గీతం||
చరణము 3
అన్న-కయపవారల సభయు అదరుచు పరుగిడిరి – ఇంకభూతగణముల ధ్వనిని వినుచు – వణకుచు భయపడిరి ||గీతం||
చరణము 4
గుమ్మముల్ తెరచి చక్కగా నడువుడి – జయవీరుడు రాగామీ వాతతాళ వాద్యముల్ – బూరలెత్తి ధ్వనించుడి ||గీతం||