#648
గగనము చీల్చుకొని యేసు - ఘనులను తీసికొని
పల్లవి · Pallavi
గగనము చీల్చుకొని యేసు – ఘనులను తీసికొని –వేలాది దూతలతో భువికి వేగమే రానుండె
చరణము 1
పరలోక పెద్దలతో – పరివారముతో కదలి ధరాసంఘవధువునకై – తరలెను వరుడిదిగో ||గగనము||
చరణము 2
మొదట గొర్రెపిల్లగాను – ముదమారగ వచ్చెనుకొదమసింహపురీతి – కదలెను గర్జనతో ||గగనము||
చరణము 3
కనిపెట్టు భక్తాది – కనురెప్పలో మారెదరు ప్రథమమునలేచెదరు – పరిశుద్ధులు మృతులు ||గగనము||