#647
కృపామయుడా నీలోన
పల్లవి · Pallavi
కృపామయుడా నీలోనే (2) నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో
చరణము 1
ఏ అపాయము నా గుడారము సమీపించనీయక నామార్గములన్నింటిలో నీవే ఆశ్రయమైనందున ||కృపా||
చరణము 2
చీకటి నుండి వెలుగులోనికి – నన్ను పిలిచిన తేజోమయుడారాజవంశములో – యాజకత్వము చేసెదను ||కృపా||
చరణము 3
నీలో నిలిచి ఆత్మ ఫలములు – ఫలించుట కొరకు నాపైన నిండుగా – ఆత్మ వర్షము క్రుమ్మరించు ||కృపా||
చరణము 4
ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీట మిచ్చుటకునీ కృప నన్ను వీడక – శాశ్వత కృపగా మార్చెను ||కృపా||