#646

క్రైస్తవుడా కదలిరావయ్యా కలుషితాత్ములకు ఈ

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Category: రెండవ అనుబంధము · Open in the hymnal app

పల్లవి · Pallavi
క్రైస్తవుడా కదలిరావయ్యా కలుషితాత్ములకు ఈ సిలువశక్తిచాటవయ్యా – ఎండమావులనియూ భ్రమసిఎంతకాలము మూలనుందువు – కుండలను ప్రేమింతువనుచున్నావుఈ మంటికుండలు ఎంత బెంచిన మంటికేనన్నా ||క్రైస్తవ||
చరణము 1
వసుధలో ప్రజలెల్లరు యేసు – వాక్యంబువివక్షుధా బద్ధులై వాంఛించుచుండగనూ – మిషనరీలనెల్ల మిషనరీల చేతమిట్టపడుచు వాదములతో – యేసు బోధను విడిచినారన్నానీవెంతకాలము – వారిచెంతనుందువోరన్నా ||క్రైస్తవ||
చరణము 2
సత్యవాక్యము సంతలో వదలి బోధకులుదొరలు భత్యములపై భ్రాంతులు నిలిపి – చిత్రమగు అనుకూలబోధలు చేసి ప్రజలను మోసగించు సూత్రధారులుచేరరాదయ్యా సుఖభోగమిడిచి సత్యవాక్యముచాటరావయ్యా ||క్రైస్తవ||
చరణము 3
శక్తిహీనుడనందువేమయ్యా – సౌజన్యమగు శుద్ధాత్మశక్తినిపొందుకొనుమయ్యా భక్తిహీనత పారద్రోలు భ్రష్టమనస్సు – బయలుపరచు శక్తికలుగు సువార్త చాటుదువుసువార్త చేయ జయమొంది ఆత్మలను రక్షించెదవు ||క్రైస్తవ||
చరణము 4
నీతికొరకై భక్తాది వరులెల్ల – నిజవిశ్వాసము నిలుపుకొన పోరాడిరే –చాల కత్తిపోట్లు రాళ్ళదెబ్బలు కరకుగలరంపములు కోతలు బెత్తములు కొరడాల దెబ్బలు – పైబడిపలి దేహము వాలలాడెను రక్తము భువిపై ||క్రైస్తవ||
చరణము 5
ఆది సంఘము నారుపాటకు నెంచి ఆ దుష్ట నిరో అధిపతిచెలరేగి గర్జించి ఆదిక్రైస్తవ భక్తుల స్తంభముల గట్టితారుపూసి అగ్నిని ముట్టించి కాల్వంగ ఆ సంఘము మెచ్చెఅధిపతి అప్పుడే నశించె ||క్రైస్తవ||
చరణము 6
దూతలకు లేనట్టి పరిచర్య – ఓ ప్రియసఖుడా ఖ్యాతిగానీ కిచ్చె గ్రంథంబు – రుచియు రసము తినుము గ్రంథము – తేనెవలెమధురముగ నుండును – జ్ఞానము నీకబ్బును హితుడాజ్ఞానంబునొంది స్వామిని సేవించుమో సఖుడా ||క్రైస్తవా||