#645

క్రైస్తవ కర్షక - కదలిరావయ్యా కన్నులు తెర

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Category: రెండవ అనుబంధము · Open in the hymnal app

పల్లవి · Pallavi
క్రైస్తవ కర్షక – కదలిరావయ్యాకన్నులు తెరిచి – కానవేవయ్యా
అనుపల్లవి · Anupallavi
కోతకాలము – గతించిపోయెగ్రీష్మకాలముకూడ – జరిగిపోయె ||క్రైస్తవ||
చరణము 1
మనుష్య కుమారుడైన క్రీస్తుయేసుమంచివిత్తనమును విత్తమున్న భూలోకంబనెడు – పొలంబందునవాక్యంబనె విత్తనంబు విత్తెను ||క్రైస్తవ||
చరణము 2
ఆదిమ క్రైస్తవ – బోధకుల వేదనతోనూ – వాక్యంబు విత్తెరోదనతోనూ – రక్తంబును గార్చి ప్రాణంబులనుదానంబుజేసిరి ||క్రైస్తవ||
చరణము 3
చల్లిన వాక్యము – ఫలించును తొలకరివర్షము కురిపించెను విలువైన ఫలములు – ఫలించు వరకుకడవరి వర్షము – కొరకు వేడుదాం ||క్రైస్తవ||
చరణము 4
పొలములు – తెల్లబారె – తెరిచిచూడు కాలము చాలగతించిపోయె కోత యజమానుడైన క్రీస్తునికోతవారిని – పంప కోరివేడుదాం ||క్రైస్తవ||
చరణము 5
శత్రువగు – సాతానుకూడా చెడ్డవిత్తనాలు – చల్లిపోయెగోధుమల మధ్య – గురుగులు కూడ ప్రచురంబుగానూపెరుగుచుండెను ||క్రైస్తవ||
చరణము 6
కన్నీళ్ళతో విత్తు – క్రైస్తవుడా కలవర మొందేద వెందులకుసంతోషముతో – సంగీతములతోనూసాగిపోవుదుము – ఆగిపోకనూ ||క్రైస్తవ||