#644

కుమ్మరి ఓ కుమ్మరి

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Category: రెండవ అనుబంధము · Open in the hymnal app

పల్లవి · Pallavi
కుమ్మరి ఓ కుమ్మరి – జగదుత్పత్తిదారీజిగటమన్నైన నా వంక – చల్లగ చూడవయ్యా......
చరణము 1
పనికిరాని పాత్రనని – పారవేయకుమా – పొంగిపొరలుపాత్రగా జేసి – నన్ను నింపుమా – సువార్తలోని పాత్రలన్నీ –శ్రీ యేసున్ పొగుడుచుండ – సాక్షిగ నుండుపాత్రగజేసి – సత్యముతో నింపుము తండ్రి ||కుమ్మరి||
చరణము 2
విలువలేని పాత్రనై నేను కొనువారులెవరువెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగజేసిఆటంకముల నుండి తప్పించి నన్ను – ఎల్లప్పుడు కావుమయ్యా ||కుమ్మరి||
చరణము 3
లోకాశతో నిండి ఉప్పొంగుచు మార్గంబునే తప్పితిన్మనుష్యేచ్ఛలన్నియును – స్థిరమనుచునే మనశ్శాంతి కోల్పోతిన్పోగొట్టుకున్న పాత్రననుచు – పరుగెత్తి నన్ను పట్టితివిప్రాణంబు నాలో ఉన్నప్పుడే – నీ పాదంబులనే పట్టితిన్ ||కుమ్మరి||