#643

కలవరి గిరిలోని శ్రేష్ఠుడా - కరుణాభరిత సి

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Category: రెండవ అనుబంధము · Open in the hymnal app

పల్లవి · Pallavi
కలవరిలోని ప్రభువా – సిలువలోని మిత్రుడాకరుణభరిత సింహాసనము – కనులు భ్రమించుప్రభువా – సిలువలోని మిత్రుడా ||కలవరి||
చరణము 1
స్తుతికి పాత్రుండగువాడా – దూతలతోవేంచేయువాడా స్తుతి మరియు పుత్రుడా – సిలువలోని మిత్రుడా ||కలవరి||
చరణము 2
పాపులకై వచ్చినవాడా – ప్రేమగలిగిన రక్షకుడాపాదములపై పడితిమి – సిలువలోని మిత్రుడా ||కలవరి||
చరణము 3
దీవెనలు ఇచ్చువాడా – వసుధకే తెంచినవాడానీవే సుంకరి ఆప్తుడవు – సిలువలోని మిత్రుడా ||కలవరి||
చరణము 4
ఐదు రొట్టెలు మరి రెండు – చేపలతో నైదు వేలజనుల పోషించిన తండ్రి – సిలువలోని మిత్రుడా ||కలవరి||
చరణము 5
నీళ్ళను రసముగా మార్చితివి – నీళ్ళమీద నడిచితివిమేళ్ళనొసగు మా దాతా – సిలువలోని మిత్రుడా ||కలవరి||
చరణము 6
రోగులను బాగుచేయువాడా – గ్రుడ్డికి నేత్రములిచ్చితివిఅనాథల నాయకుడా – సిలువలోని మిత్రుడా ||కలవరి||
చరణము 7
హల్లెలూయ కర్తుడా – ఎల్లరు కొనియాడువాడాబలముతో వచ్చు రాజా – సిలువలోని మిత్రుడా ||కలవరి||